4661) అతిశ్రేష్టుడా మహానీయుడైన యేసయ్యా

** TELUGU LYRICS **

అతిశ్రేష్టుడా మహానీయుడైన యేసయ్యా
పరిశుద్ధుడా వేల్పులలో ఘనుడా (2)
స్తుతి ఘనత ప్రభావములు
నీకే చెల్లింతును (2)
ఆరాధన స్తుతి ఆరాధన
నీకే ఆరాధన స్తుతి ఆరాధన (2)
||అతిశ్రేష్టుడా||

నీదు నామము అమూల్యమైనది
ఆదియు అంతము లేని సజీవుడా (2)
యుగయుగములకు మారని దేవా
తరతరములకు పూజ్యుడ నీవే (2)
ఉన్నవాడవు అనువాడవు 
ఉన్నవాడవు అనువాడవు నీవే దేవా
ఆరాధన స్తుతి ఆరాధన
నీకే ఆరాధన స్తుతి ఆరాధన (2)
||అతిశ్రేష్టుడా||

వర్ణనకందని సత్య స్వరూపుడా
నీదు ప్రేమకు అవధులు లేవ్వయ్యా (2)
అరుణోదయమున నీ సన్నిధిలో
జీవ బలులను ఆర్పించెదను (2)
ప్రాణనాథుడా  ప్రేమాపూర్ణుడా 
ప్రాణనాథుడా ప్రేమాపూర్ణుడవు నీవే దేవా (2)
ఆరాధన స్తుతి ఆరాధన
నీకే ఆరాధన స్తుతి ఆరాధన (2)
||అతిశ్రేష్టుడా||

పరిపూర్ణమైన సౌందర్య సీయోనులో
నీతో నిలచుట నాకెంతో ఆనందమే (2)
ఉన్నతమైన నీ ఉశదేశము
మర్చుము నన్ను నీ పోలికేగా (2)
పునరుత్థానుడా నీతిసూర్యుడా
పునరుత్థానుడా నీతిసూర్యుడవు నీవే దేవా (2)
ఆరాధన స్తుతి ఆరాధన
నీకే ఆరాధన స్తుతి ఆరాధన (2)
||అతిశ్రేష్టుడా||

---------------------------------------------------
CREDITS : Brother. Kiran Kumar
---------------------------------------------------