4663) ఆగదు నా పయనం సీయోను చేరకుండా

** TELUGU LYRICS **

ఆగదు నా పయనం - సీయోను చేరకుండా 
ఆశలు కోరికలు - వెనకకు లాగిననూ
నా గమ్యము చేరగ - సాగిపోయెదనూ 
ఎల్షద్దాయ్ బలమియ్యగా  
మరి లోతుగా వేరు తన్నెదను
మరి క్రిందికి వేరు తన్నెదను
అదొనాయ్ తోడుండగా 
పైకెదిగీ ఫలియించెదన్ 

ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి 
శ్రేష్ట స్థలమున లోతుగా నాటి 
సంద్రము వరకు వ్యాపింపజేసి
కొండలే ఎక్కించినావే  
నీ చేతి కొమ్మనూ 
నీ నీడలో కాయుమా 
||ఎల్షద్దాయ్||

గుండె కడవను పాలతో నింపి 
ఎముకల్లోనా మూలుగు పెంచి 
ఎత్తైన కొండ ఎక్కే బలమును
కృపతో నాకిచ్చావే 
నీ చేతి భోజనమే 
ఈ శక్తి నాకిచ్చెనూ
||ఎల్షద్దాయ్||

ఎగిరే రెక్కలు నాకిచ్చినా గాని 
నా గాయాల్లోనే దాగుందునూ 
సింహాన్నే చంపే బలమిచ్చినా
నీ చాటునే బ్రతికెదనూ 
బలమూ నీదే కదా 
కృపయూ నీదే కదా

----------------------------------------------------
CREDITS : Pas. T.Jafanya Sastry
----------------------------------------------------