** TELUGU LYRICS **
ఉన్నావు తండ్రి నాకు తోడుగా
నిత్యము నన్ను నడిపించు నావికా (2)
నీ కార్యములు ఉన్నతమైనవి
ఊహకు అందనివి - వర్ణింపు లేనివి (2)
||ఉన్నావు||
నిత్యము నన్ను నడిపించు నావికా (2)
నీ కార్యములు ఉన్నతమైనవి
ఊహకు అందనివి - వర్ణింపు లేనివి (2)
||ఉన్నావు||
మహిమగల సింహాసనమును స్వాస్థ్యముగా నేను పొందుడుకు
దరిద్రులను అధికారుల యెదుట ఘనపరచి నిలబెట్టుటకు (2)
లేమి గలవారిని సమృద్ధి కృప తో నింపువాడవు నీవే దేవా (2)
||నీ కార్యములు||
దుఖములో వేసారిన వారికి క్షేమమునిచ్చెదవు నీవు
దీన దశలో పడియున్న వారినిఉద్ధరించువాడవు నీవే (2)
కృంగిన వారిని చేయిపట్టి లేవనెత్తు వాడవు నీవే (2)
||నీ కార్యములు||
ప్రార్థనలు విజ్ఞాపనలు ఆలకించు వాడవు నీవే
స్థిర పరచి నను బలపరచి ధైర్యమనిచ్చు వాడవు నీవే (2)
నీ రాజ్యములో నే నుండుటకు నన్ను సిద్ధపరచుము నాదు యేసయ్యా (2)
||నీ కార్యములు||
----------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : pas. P. Suseela & Pas. K. Jermiah
Vocals & Music : Bro. Deeven Babu & Immi Johnson
----------------------------------------------------------------------------------------------