4637) నేనెంత ధన్యుడనో ప్రియుడా యేసయ్య నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి

** TELUGU LYRICS **

నేనెంత ధన్యుడనో ప్రియుడా యేసయ్య
నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి
సమృద్ధి కృపతో మారని ప్రేమతో
ఉన్నత కార్యములు నాకై చేసితివి
పరవశమే పరిమళమే నీ కౌగిలిలో
సంతసమే సంబరమే నీ సన్నిధిలో

నీకు దూరమైన స్థితిలో నే గాయపడిన వేళ
నా దీనస్థితిని చూచి దాటిపోక
నా హృదినే కట్టినావే పరమ తండ్రిగా
క్షేమం బహుపదిలం నీ ఒడిలోనే
ధైర్యం సహవాసం నీ ఉపదేశం

శ్రమకు తాళలేని స్థితిలో నే తల్లడిల్లువేళ
నీ కరము చాపి నన్ను చేరదీసి
నీ చెలిమి పంచినావే నా హితుడవై
గమనం నా గమ్యం నీ కృపలోనే
గానం నా గాత్రం నీ కొరకే

నిరాశచందు స్థితిలో నే సాగలేనివేళ
నీ ఆత్మ వర్షమును పంపినాకై
ఫలింపచేసినావే నాదు బ్రతుకును
సాక్ష్యం నా సర్వం నీవేనయ్యా
జీవించెద నీకై శ్రేష్ట ఫలముగా

-------------------------------------------------------
CREDITS : Music : Sandeep
Tune, Lyrics, Vocals : Pas. Akshay
--------------------------------------------------------