** TELUGU LYRICS **
రండి రారండి రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను (2)
ప్రయాసపడుచూ భారముమోయు ప్రజలారా... ఆ... (2)
రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను
రారమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను
||రండీ రండి రారండీ||
ప్రయాసపడుచూ భారముమోయు ప్రజలారా... ఆ... (2)
రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను
రారమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను
||రండీ రండి రారండీ||
అగాధమనే లోకములో ఎన్నేళ్లు అలసిపోదువు
దరికాన రావయ్యా దరి చేరుకోవయ్యా
యేసుకై రారమ్ము వేగమె రారమ్ము (2)
||రండీ రండి రారండీ||
శోకమనే బాధలలో ఎన్నేళ్లు సొమ్మ సిల్లెదవు (2)
ప్రభు ప్రేమ కానవయ్యా ప్రభు మాట వినవయ్యా
ఆశ్రయమిస్తాడు నిన్ను ఆదరిస్తాడు (2)
||రండీ రండి రారండీ||
యేసు అనే నామములో పరమనివాసం దొరుకును మీకు (2)
విమోచన ఇస్తాడు ముక్తిని ఇస్తాడు
శక్తి మంతుడేసు జయమునిచ్చునతడు (2)
||రండీ రండి రారండీ||
-------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune: Bro.T.Vijayanand
Vocals & Music : Vagdevi & Ravi Kumar
-------------------------------------------------------------------