** TELUGU LYRICS **
నీ స్వరము వినాలని ఎంతో ఆశగా వేచి వున్నానయ్య
నీ కొరకు బ్రతకాలని ఎంతో ఆశగా పయనిస్తువున్న
నీ కొరకు యేసయ్య... యేసయ్య... బ్రతికెదను
నీ కొరకు బ్రతకాలని ఎంతో ఆశగా పయనిస్తువున్న
నీ కొరకు యేసయ్య... యేసయ్య... బ్రతికెదను
దారి తప్పి తిరుగుచుంటిని గమ్యం లేక
ఎవరు లేని జీవితమే వేసారిపోయే (2)
నీ కృపతో నను చేరదీసావు నీ ప్రేమతో దరిచేర్చావు
నీ కొరకు యేసయ్య... యేసయ్య... బ్రతికెదను
||నీ స్వరము||
కార్చిన రక్తం చూపెనే కరుణ నీ ప్రేమతో
నాకై పొందిన మరణం ఇచ్చెను జీవం నీ మహిమతో (2)
నీ సిలువే నాకు ఆధారము
నీ రక్తమే నాకు ఆశ్రయము
నీ కొరకు యేసయ్య... యేసయ్య... బ్రతికెదను
||నీ స్వరము||
-----------------------------------------------------------------------------------------------------------
CREDITS : Music : Pas. Ebenezer Paul Goda
Written & Vocal : Ludia (Devi) & Sipporah Gabriel and Jessica Gabriel
-----------------------------------------------------------------------------------------------------------