4613) ఉజ్జీవమైనది నీతో ప్రయాణం ఉత్తేజ పరచున్నది నాలో సదాకాలం

** TELUGU LYRICS **

ఉజ్జీవమైనది నీతో ప్రయాణం
ఉత్తేజ పరచున్నది నాలో సదాకాలం (2)
ఆరోగ్యమిచ్చునది నీ నామ గానం 
ఆశ్చర్యపరచు నది నీలో ప్రతి మార్గం (2)
సదాకాలం నీతోనే పయనం ప్రతి మార్గములో నీ నామ గానం (2)  
||ఉజ్జివ||

అలలువలెనే ఎగసిపడును ఈ లోక ప్రయాణము,
గమ్యానికి దారి చూపని ఈ లోకమే అంధకారమయము (2)
ముగింపే లేని మనసు ఆలోచన క్రమము,
అదుపు చేయుము ఆత్మను కాపాడుము (2)
నన్ను గద్దించుము నీ త్రోవలో నడిపించుము (2)
||ఉజ్జివ||

సంద్రంకంటే లోతైనది నరుని హృదయము,
ఆధారము ఉన్నదని పైనుంచి చున్నది ప్రతి నిత్యము (2)
హద్దులే లేని మనసుకు ఆలోచన తత్వము
కనుమరుగై పోక ముందే నన్ను కనిపెట్టుము (2)
కడవరిదినములలో నన్ను నిలువ బెట్టుము (2)
||ఉజ్జివ||

---------------------------------------------------------------------------
CREDITS : Music & Tune : Pavithran Thadiparthi
Lyrics & Vocals : Vineela B & Philip, Sharon 
---------------------------------------------------------------------------