4612) దినములు గడుచుచుండగా నీ మేలుతో తృప్తిపరచితివి

** TELUGU LYRICS **

దినములు గడుచుచుండగా నీ మేలుతో తృప్తిపరచితివి
జనములు చూచుచుండగా నీ వాగ్దానము నెరవేర్చితివి
ఎల్షద్దాయ్ దేవుడా స్వరమెత్తి నిన్ను పాడెదన్
ఎల్షద్దాయ్ దేవుడా స్వరమెత్తి నిన్ను పొగడెదను
ఆరాధనా నీకై అలాపన
స్తుతి అర్పణ నీకై నీరీక్షణ 
||దినములు|| 

యోగ్యత అర్హత లేని నన్ను ఎన్నుకొంటివి
నీ సువార్తను చాటగా జీవవాక్కుతొ నింపితివి (2)
నా కన్నీటిని నీదు బుడ్డిలో దాచుకొంటివి ప్రియ ప్రభువా
చాటెదన్ నీ నామము నాలో ప్రాణమున్నంత వరకు 
||అరాధనా||

శాంతినీ సమృద్ధినీ క్షేమమును నొసగితివి
దుష్టుని జయింప ఆత్మ శక్తితొ నింపితివి (2)
బలహీనతలో బలమునిచ్చి ఆదుకొంటివి  ప్రియ ప్రభువా 
అంతయు నీ దయా నీ కృపా దానమే
||అరాధనా||

-----------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Bro.Tony Bandela
Vocals & Music Bro. Nissy John & Bro. Jonah Samuel 
-----------------------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments