4538) రక్షకుడే పుట్టాడండి రక్షణనే తెచ్చాడండి నా మంచి దేవుడు నా యేసుక్రీస్తు

** TELUGU LYRICS **

రక్షకుడే పుట్టాడండి రక్షణనే తెచ్చాడండి
నా మంచి దేవుడు నా యేసుక్రీస్తు (2)
నా కొరకు మానవునిగా వచ్చెను (2)
యేసురాజును పూజింప తరలి రారండి

లోకమంతా వెలుగులతో నిండెను
సర్వ మానవాలి సంతోషం పొందెను (2)
పాపము బాపెను రక్షణ నిచ్చెను
సత్యసువార్తను ప్రకటించెను (2)

గొర్రెల కాపరులు స్తుతియించుచు వచ్చిరి
జ్ఞానులంతా కానుకలే తెచ్చిరి (2)
పూజింప వచ్చిరి క్రీస్తును మొక్కిరి
రారాజు దేవుడని లోకానికి చాటిరి (2)

-------------------------------------------------------
CREDITS : Lyrics : Swathi Palem
Music, Vocals, Tune : Dheeraj Paul
-------------------------------------------------------