4514) నిత్యమైన ప్రేమతో నన్ను ప్రేమించిన నిరంతర స్తోత్రార్హుడా వందనము

** TELUGU LYRICS **

నిత్యమైన ప్రేమతో నన్ను ప్రేమించిన 
నిరంతర స్తోత్రార్హుడా వందనము
శాశ్వతమైన రక్షణనిచ్చి నన్ను దర్శించిన
యేసయ్య నీ ప్రేమాకై వందనము
సర్వ శక్తిమంతుడా సర్వాధికారుడా 
ఇమ్మానుయేలువై తోడైయున్నావు (2)

బెత్లహేము ఊరిలో మాకై ఉదయించావు
మము వెలిగింప వెలుగై వచ్చావు (2)
శుభవార్తను దూతలు ప్రకటింప వచ్చారు
తూర్పు జ్ఞానులు గొల్లలు నిన్ను పూజించారు
||సర్వ||

శరీరదారివై ఈ భువికొచ్చావు
దైవమానవునిగా నీవు జీవించావు (2)
దేవా తనయునిగా తండ్రికి విధేయుడవైనావు
తండ్రి చిత్తమును భువిపై సంపూర్తిచేసావు
||సర్వ||

--------------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Pastor. Israel Raju Sirra
Music & vocals : Anand Piano & Priscilla Israel Sirra
--------------------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments