4516) నిత్యజీవమే దేహరూపమై నాకై జన్మించెను

** TELUGU LYRICS **

నిత్యజీవమే దేహరూపమై నాకై జన్మించెను
నీతి సూర్యుడే అంధకారలోయలో నాకై ఉదయించెను
నూతన జన్మను పొందాలనీ
నూతన సృష్టిగ మారాలనీ
నూతన వధువునై వుండాలనీ
నూతన యేరుషలేమ్ చేరాలనీ (2)
శ్రీమంతుడే రిక్తుడైయ్యాడుగా
నా బ్రతుకులో దీపమైయ్యాడుగా-దీపమైయ్యాడుగా
||నిత్యజీవమే||

శిల్పిఅయిన దేవుడే సిలువనెక్కగా పుట్టాడనీ
విలువలేని నన్ను విడువక విలువపెట్టి కొన్నాడనీ (2)
యేసయ్యే కొన్నాడనీ - నేను నా సొత్తుకాననీ 
అరణ్యజీవిననీ - మధురమన్నాగా వచ్చావనీ   
||నూతన||

భీకర రూపము వదులుకొనీ దాసుని రూపము దాల్చుకొనీ
మరణపు ముల్లును విరవాలనీ మహిమను విడచీ వచ్చావనీ (2)
గొప్పదేవుడు నీవేననీ - నను దీవింపవచ్చావనీ
నీ వాత్యల్య వర్షముతో- నను చిగిరింపజేయాలనీ
||నూతన||

పాపపు విషముతో నిండుకొనీ - నీతిహీనమైయుంటినీ
చెడిన నన్ను కడుగుటకై పరము వీడి వచ్చావనీ (2)
బలిపశువుగ వచ్చావనీ- నను జీవింపజేయాలనీ
నీ కృపబాహూళ్యముతో నను ఆశీర్వదించాలనీ
||నూతన||

-----------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Ps. V. Yesepu Anna
Vocals & Music : Sis. Kanthikala Garu & Danuen Nissi
-----------------------------------------------------------------------------------