** TELUGU LYRICS **
నీతి సూర్యుడు ఉదయించెను తూర్పు దేశమందునా
గొల్లలు ఙానులు చూడవచ్ఛిరి ఆ నక్షత్రపు మార్గమునా
నీ కొరకు నా కొరకు దివి నుండి భువికి అరుధించెగా
చీకటి బ్రతుకును -వెలుగుగ మార్చుటకై మనకొరకు ఇల జన్మించెగా
ఓ బెత్లహేమా ఓ బెత్లహేమా
ఓ బెత్లహేమా ఓ బెత్లహేమా
సర్వలోకానికి మూలస్తంభమా
ఓ జనమా నేటితరమా
ఓ సంఘమా నా ప్రియ సంఘమా ఈ రక్షణ శుభవార్త ను చాటి చెప్పుమా
ఓ బెత్లహేమా ఓ బెత్లహేమా
సర్వలోకానికి మూలస్తంభమా
ఓ జనమా నేటితరమా
ఓ సంఘమా నా ప్రియ సంఘమా ఈ రక్షణ శుభవార్త ను చాటి చెప్పుమా
||నీతి సూర్యుడు||
కలతలను సంతోషముగా - కొరతలను సమ్రృధ్దిగా
కన్నీటిని నాట్యముగా - మార్చినా యేసయ్య
బాధలలో మా బంధువై - ఆపదలో ఆలోచనవై
దిక్సూచివై నడిపించిన మా మెస్సయ్యా
నీవే లోక రక్షకుడవు - సర్వ సృష్టికి ఆధారమూ (2)
||ఓ జనమా||
క్రోదమును శాంతముగా - గర్వమును దినత్వముగా
అసూయనుండి విడిపించిన మా ప్రేమమా
పాపముపై విజయము - అపవాధిపై అధికారమునూ
పాపముపై విజయము - అపవాధిపై అధికారమునూ
సిలువలొ మాకిచ్చిన అతి పరిశుద్దుడా
సాటిలేరు నీకు ఇలలో - పునరుద్దాణుడవు నీవెగా (2)
సాటిలేరు నీకు ఇలలో - పునరుద్దాణుడవు నీవెగా (2)
||ఓ జనమా||
-----------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Bro. Victor
Music & Vocals : K Samuel Mories & Yomima Rapaka
-----------------------------------------------------------------------------------