4592) మునుపు ఉండినదే ఇక ముందు ఉండుననీ మునుపు జరిగినదే ఇక ముందు జరుగుననీ

** TELUGU LYRICS **

మునుపు ఉండినదే ఇక ముందు ఉండుననీ
మునుపు జరిగినదే ఇక ముందు జరుగుననీ
నూతనమైనది ఏదియు లేదు
నూతనముగనీ బ్రతుకు మారాలిగా
||నూతన||
అపుడే నూతనజీవితం అదియే నూతనవత్సరం (2)


మునుపు ఉండినదే ఇక ముందు ఉండుననీ 
మునుపు జరిగినదే ఇక ముందు జరుగుననీ
Happy New Life Happy New Life
Happy New Year Happy New Year
Happy New Life Wish You Happy New Life
Happy New Life Wish You Happy New Life

సమస్తమైన దుష్టత్వమును 
సమస్తమైన కపటమును
సమస్తమైన అసూయలను
సమస్తమైన దూషణలను 
నీలోనుండి పారద్రోలుము (2)
క్రొత్తగ నీవు మార్పుచెందుము (2)
ఇదియే మంచి తరుణం
ఇదియే రక్షణ దినము
||ఇదియే|| ||మునుపు||

నూతనమైన శిశువును పోలి
వాక్యమనే పాలు త్రాగాలిగా
రక్షణలోనా ఎదుగుచు మనము
క్రీస్తేసు బాటలో నడవాలిగా 
నీగతం విడనాడుము (2)
నీజీవితం మార్చుకొనుము (2)
ఇదియే మంచి తరుణం
ఇదియే రక్షణ దినము
||ఇదియే|| ||మునుపు||

----------------------------------------------------------------------------------------------------
CREDITS : Tune,  Music : Gideon Katta 
Lyrics & Vocals : Anand Medari, M.B.Th, & Hymath Mohammed 
----------------------------------------------------------------------------------------------------