4560) మరుమల్లెలు విరిసిన రోజు చిరునవ్వులే చిందిన రోజు

** TELUGU LYRICS **

మరుమల్లెలు విరిసిన రోజు
చిరునవ్వులే చిందిన రోజు (2)
కరుణాళుడే పుట్టినరోజు (2)
ఇదే ఇదే ఇదే విశ్వశాంతి దినం
క్రీస్తు జన్మదినం (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హోసన్నా 
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)

మరణపు ఛాయా ముసిరినను
చీకటి ముసుగు కమ్మినను (2)
నలిగిన హృదయముండినను
విడుదలనిచ్చే పర్వదినం (2)
ఇదే ఇదే ఇదే విశ్వశాంతి దినం
క్రీస్తు జన్మదినం (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హోసన్నా 
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)
||మరుమల్లెలు||

శాంతియే లేని బ్రతుకులలో
కాంతియే లేని గమ్యములో (2)
చింతలే చుట్టుముట్టినను
సంతసమిచ్చే పర్వదినం (2)
ఇదే ఇదే ఇదే విశ్వశాంతి దినం
క్రీస్తు జన్మదినం (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హోసన్నా 
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)
||మరుమల్లెలు||

-------------------------------------
CREDITS : Divya David 
-------------------------------------