4520) లోకరక్షకుడు జన్మించెనూ మన కొరకై భువికొచ్చేను

** ENGLISH LYRICS **

లోకరక్షకుడు జన్మించెనూ
మన కొరకై భువికొచ్చేను (2)
ఆడీ పాడీ ఊరూ వాడా తిరిగీ
యేసయ్య జన్మ సువార్త ప్రకటించెదను 

సర్వోన్నత గల స్థలములలో
దేవుని మహిమను కీర్తించిరీ
ఇమ్మానుయేల్‌ గా మనకై పుట్టాడని
గొల్లలు వచ్చి దర్శించిరీ(2)
ఓ యేసు నీ జననం మాకెంతో ఆనందం
నిన్ను చేరి కీర్తించడం సంతోషమే (2)

తూర్పు దిక్కున నక్షత్రం చూసే
జ్ఞానులూ కనుగొంటిరీ
బంగారమును బోళమూనూ
సాంబ్రాణి అర్పించీ మ్రొక్కీతిరీ
ఓ యేసు నీ జననం మాకెంతో ఆనందం (2)
నిను చేరి కీర్తించడం సంతోషమే 
||లోక రక్షకుడు||

---------------------------------------------------------------
CREDITS : Music : Abhishek Rufus 
Lyrics & Vocals : Might Angel & Sanketh 
---------------------------------------------------------------