4603) గతకాలమంతా కాపాడినావు మితిలేని ప్రేమను చూపించినావు

** TELUGU LYRICS **

గతకాలమంతా కాపాడినావు
మితిలేని ప్రేమను చూపించినావు
ఇంతవరకు ఆదుకున్నావు
శ్రమలో నాకు తోడై యున్నావు 
శిక్షణిచ్చి నడిపిస్తున్నావు
నాకు మార్గదర్శి వైనావు

ఎందరో గొప్పవారు నాకన్నా ముందున్నవారు
నేడు మృతులైయుండగా
బలహీనమైన నాకై నీ రెక్కలు చాపి
నన్ను నీలో దాచియుంచావు

భారం మోయలేని తీరం కానరాని 
అనుభవాలలో ఉండగా
విడుదలనిచ్చావు నీ కృప చూపావు
నీ దరి నన్ను చేర్చావు

ఎండిన ఎముకనై ఆశలు విఫలమై
వేసారిపోయుండగా
వాక్కును పంపావు ఆత్మతో నింపావు
సాక్షిగా నిలుపుకున్నావు

-------------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------------