4558) దేవాది దేవుడు మనుజావాతారిగ పరముని వీడి ఇహమునకు వచ్చాడు

దేవాది దేవుడు మనుజావాతారిగ
పరముని వీడి ఇహమునకు వచ్చాడు
నిశి రాత్రి వేళలో ఒక చిన్న ఊరిలో
లోకానికి వెలుగును పంచగ పుట్టాడు

ఇది శుభమని మనకు తెలిపెను గాబ్రియేలు దూత
రారండి తేరి చూతుము ఆ రాజాది రాజును
కానుకలు అర్పించి మ్రొక్కిరి గొల్లలు జ్ఞానులు ఎళ్లరు
బంగారము సాంబ్రాణి, బొలముప్రభుకే అర్పించేదము

భయపడకని మరియతో పలికెను దూత
ఉదయించును రక్షకుడు అను శుభవార్త
జగములను పరిపాలించెడి రేడు
మమ్ము కావగ జన్మించెను ఈనాడు
పయనాన్ని చూపించింది ఒక తార
అది వెళ్లి ఆగిన చోటు ద్వారా
ధివి భూవిని కాపాడే మహారాజు
పశు పాకలో పరుండెనే ఈ రోజు 
దేవాది దేవుడు....

సర్వలోక రక్షకుని ఆగమనం
లోకమంత పర్వదినం ఈ సమయం
సంతసానికి అవధులు అన్నవి లేవు
తన్మయంలో ఉప్పొంగెను నా హృదయం
కనులారా చూతుము రండి ఈ బాలుని
మనసారా కొలిచెదము మన దేవుని
దూతలంతా జోలలు పాడే దృశ్యం
పదములతో వర్ణించుటకు ఆశక్యం

-------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune: Dr. Sam Jaysheel
Music & Vocals : Ashok M & Surya Prakash
-------------------------------------------------------------------