4546) బేత్లెహేము పురమున దావీదు రాజు వంశమందు యెషయి మొద్దు నుండి చిగురు పుట్టెను

** TELUGU LYRICS **

బేత్లెహేము పురమున - దావీదు రాజు వంశమందు 
యెషయి మొద్దు నుండి చిగురు పుట్టెను  
రారాజు యేసు అరుదెంచెను - రారాజు యేసు అరుదెంచెను
ఆశ్చర్యమే ఇది ఆనందమే - అద్భుతమే ఇది ఆర్భాటమే 
||బేత్లెహేము||

పాప శాపముల తొలగింపను - మరణ భయములను తీసివేయను 
శత్రు రాజ్యమును కూల్చివేయను - శాంతి రాజ్యమును స్థాపించను 
మహిమాన్వితుడు మహిమను వీడి.. ఇమ్మానుయేలుగ ఏతెంచెను 
సంతోషమే ఇక సమాధానమే - ఉత్సవమే ఇది ఉత్సాహమే
||బేత్లెహేము||

కన్నియ మరియ మురిసిపోయెను - భక్తులెల్లరూ సంతసించిరి 
పామరులంతా చిందులేసిరి - పండితులెల్లా పూజ చేసిరి 
సంతోషమే ఇక సంబరమే - ఉత్సవమే ఇల ఉల్లాసమే
||బేత్లెహేము||

-------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------