** TELUGU LYRICS **
యేసయ్య జన్మించే ఈ నేలపై
సంబరాలు చేసేద్దాం ఏకమై (2)
లోకమును ప్రేమించి వచ్చిన
ప్రియ కుమారునికై (2)
ఊరూరా వెళ్లేదాం సువార్త చేసెదం
లోకాన చాటేద్దాం (2)
||యేసయ్య||
సంబరాలు చేసేద్దాం ఏకమై (2)
లోకమును ప్రేమించి వచ్చిన
ప్రియ కుమారునికై (2)
ఊరూరా వెళ్లేదాం సువార్త చేసెదం
లోకాన చాటేద్దాం (2)
||యేసయ్య||
కన్నె మరియా గర్భమున
దైవసుతుడే జన్మించెను
జనన వార్తతో లోకమంతా
శుభ దినాలే మొదలాయెను (2)
రక్షకుడే ఇలకొచ్చెను రక్షణతో
మనలను నడిపెను (2)
మనతో ఒకరిగా ఉండెను
ఊరూరా వెళ్లేదాం సువార్త చేసెదం
లోకాన చాటేద్దాం (2)
||యేసయ్య||
సంతోషాలను పంచుకునే
దూత శుభవార్తనే తెచ్చెను
అవధులు లేని ఆనందంతో
ధరణియె ఉప్పొంగెను (2)
ప్రవచనాలే నెరవేరేను
శ్రమదినాలే ఇక పోయెను
మనలో శాంతినే నింపెను
ఊరూరా వెళ్లేదాం సువార్త చేసెదం
లోకాన చాటేద్దాం (2)
||యేసయ్య||
-----------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Padala Suresh Babu
Vocals & Music : Yangala Ravi & Vijay Samuel
-----------------------------------------------------------------------