4386) విసిరీ వెళ్ళి తిరిగిరాని గాలివి కనిపించీ మాయమయ్యె ఆవిరివి

** TELUGU LYRICS **

విసిరీ వెళ్ళి తిరిగిరాని గాలివి
కనిపించీ మాయమయ్యె ఆవిరివి
ఉదయించీ అస్తమించె సూర్యుడివి
ప్రభుయేసుని నమ్ముకొంటె ధన్యుడివి
ఓమనిషి నీ వెవ్వరు... నీయాత్రలో తోడెవ్వరు

విత్తుట కోయుట ఎరుగని పక్షికి లోటేముంది
ఎండకు వానకు అడివిలో జీవికి భయమేముంది
బ్రతకటానికి మనిషిచింత బహు వింతగ ఉందీ
పగలు రాత్రులు పని చేసినా ఫలితము ఏముంది 
ఓమనిషి నీ వెవ్వరు... నీయాత్రలో తోడెవ్వరు

కలిమి ఉంటె చెలిమి చేసే లోకములో
నీ దీన స్థితిలో దిక్కుగ నిలిచే వారెవ్వరు
దీనులతో ధనికులు స్నేము చేసెదరా
నిను ప్రేమించుటలో యేసుకు సాటి లేరుకదా
ఓమనిషి నీ వెవ్వరు... నీయాత్రలో తోడెవ్వరు

అన్నము వస్త్రము కలిగిన బ్రతుకు ఎంత ధన్యమూ
ఇంటినిండా ధనరాశులున్నా చాలును అనము
నీ ప్రాణం ఉంటే పట్టు బట్టకు విలువుంటుందీ
నీవే లేని వజ్రము అయినా వట్టిదే అవుతుంది
ఓమనిషి నీ వెవ్వరు... నీయాత్రలో తోడెవ్వరు

-----------------------------------------------------------------------
CREDITS : Lyrics : K.SatyaVeda Sagar garu
Singer & Music : Yamini garu & Prasanth garu
-----------------------------------------------------------------------