4430) సిద్ధపరచిన గొప్ప రక్షణ నేడు చూడరండి


** TELUGU LYRICS **

సిద్ధపరచిన గొప్ప రక్షణ నేడు చూడరండి
ధాత్రి వెలసిన యేసుపేరున పాటపాడరండి (2)
ఆరాధించుడి ఆనందించుడి
ఆరాధించుడి ఆనందించుడి
సర్వలోక జనమా (2)
||సిద్ధ||

తల్లవుతావనే వార్త చేరేనే
మరియమ్మకు కన్య మరియమ్మకు (2)
కృంగిపోకనే సిద్దామాయేనే 
యేసయ్యకు జన్మనిచ్చేందుకు (2)
ప్రభువు దాసురాలనని విధేయత చూపింది
పరిశుద్ధాత్మ ద్వారానే ఇది సాధ్యం అయ్యింది
||ఆరాధి||

దూత వచ్చెనే నిజము చెప్పెనే
యోసేపుకు భక్త యోసేపుకు (2)
మనసు మారెనే బయలుదేరెనే 
చూసేందుకు చేర్చుకునేందుకు (2)
దైవచిత్తాన్ని ఎరిగే ప్రవర్తన నేర్పింది
వినయమనసు ద్వారానే ఇది సాధ్యం అయ్యింది
||ఆరాధి||

తార సాగెనే దారి చూపెనే
జ్ఞానులకు తూర్పు జ్ఞానులకు (2)
ప్రకాశించేనే ఇల్లు చేర్చేనే
మొక్కేందుకు పూజ చేసేందుకు (2)
క్రీస్తు దర్శనం కలిగే సహాయము చేసింది
దైవబోధ ద్వారానే ఇది సాధ్యం అయ్యింది
||ఆరాధి||

--------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
--------------------------------------------------------------------------------------------