4443) రక్షకుడు పుట్టాడురా ఇలలోన యేసయ్య పుట్టాడురా


** TELUGU LYRICS **

రక్షకుడు పుట్టాడురా ఇలలోన 
యేసయ్య పుట్టాడురా (2)
చీకటిని తొలగించను యేసయ్య 
వెలుగుగా వచ్చాడురా (2)
ఊరంతా వాడంత సంతోషమే  
ఊరువాడంతా ఆనందమే (2)

కన్యాగర్భమున రక్షకుడు పుట్టాడు 
ఆ మాట విన్నారు గొల్లలంతా (2)
తారను చూచుకుంటు జ్ఞానులు వచ్చారు (2)
బంగారు సాంబ్రాని బోళములు కానుకలర్పించారు (2)
ఊరంతా వాడంత సంతోషమే  
ఊరువాడంతా ఆనందమే (2)

రాజుల రారాజు వచ్చాడు మనకోసం 
వాగ్దానం చొప్పున వెలిసాడు భువిలోన (2)
మన పాపభారములు తొలగింపవేయుటకు (2)
పరిశుదుడు బాలునిగా జన్మించెను మానవాళిరక్షణకొరకు (2)
ఊరంతా వాడంత సంతోషమే  
ఊరువాడంతా ఆనందమే (2)

---------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Pastor Korneli
Music & Vocals : Ganta Ramesh & Ramesh Nelli
---------------------------------------------------------------------------