4446) రారాజు పుట్టండోయ్ ఓ జనులారా రారాజు పుట్టాడండోయ్


** TELUGU LYRICS **

రారాజు పుట్టండోయ్ ఓ జనులారా  
రారాజు పుట్టాడండోయ్ 
కన్యకా మరియా గర్భమున యేసు జన్మించెను   
ఆయనే మనలను పాలించును 
ఆయనే  మనలను రక్షించును
ఆనందం సంతోషం సమాధానం కలిగెను 
దేవునికే మహిమ స్తోత్రములు చెల్లించుదాం 
జనులకు  యీ  వార్త తెలుపుదాం 
ఊరంతా చాటిద్దాం 
యేసు మనకై పుట్టాడని 
యేసు మనకై  వచ్చాడని 

పరిశుద్దుడైన యేసు మనకు జన్మించెను 
మన భారములను తొలగించును 
మన పాపములను క్షమించుటకు 
దిగివచ్చెను మనలను పరిశుద్దులుగా చేయును 
సర్వజనులకు రారాజు యేసు 
సర్వలోకమును  ఏలును 
నిత్య సమాధానం నిత్య ఆనందం ఆయన యొద్ద వున్నవి 
సర్వోన్నతమైన స్థలములలో ఆయనకే మహిమ ఘనతా (4)

గొఱ్ఱెల కాపరులు యేసుని చూచిరి 
రక్షకుడేసుని  ప్రచురము చేసిరి 
జ్ఞానులు యేసుని చూడ వచ్చిరి 
కానుకలర్పించి పూజించిరి 
నీ హృదయమును అర్పించుము 
నూతన సృష్టిగా నిను మార్చును  
నిత్య జీవము నీతి సత్యము అయన యొద్ద వున్నవి
సర్వోన్నతమైన స్థలములలో ఆయనకే మహిమ ఘనత (4)

----------------------------------------------------
CREDITS : Vocals : Dhanunjay
Lyrics, Tune, Music : AK Andrew
----------------------------------------------------