4445) చందమామ చందమామ రాజు పుట్టాడంట ఓయమ్మా


** TELUGU LYRICS **

చందమామ చందమామ
రాజు పుట్టాడంట ఓయమ్మా
వెన్నెలమ్మిది నిజమా
అతన్నికన్నా సుందరుడంటమ్మా (2)
నవ్వుల పసిబాలూడోయమ్మ
అధ్వితీయుడే అరుదించడమ్మా
నశియించే మనకోసం ప్రేమించి ఇలా వచ్చాడమ్మా
రండయ్యో రండమ్మా స్వాగతీద్దాం
మన హృదయంలోనే వేదికేదాం
సంతోష సంబరాలు చేసేదాం
మనమంతా కలిసి పండుగ చేదాం (2)

యూదయ దేశమున బేత్లేహేము గ్రామమున
ఓ గొప్ప వెలుగు ప్రకాశించే
ఏమిటని సూడబోతే ఓ దూత ఎదురుపడి
మెస్సయా పుట్టాడని వార్త చెప్పే
పరుగున పరుగున సూడ వెళ్ళామే
రారాజునే దర్శించామే
ఆ సుందరుని హృదిలో మేము నిండామే
ఎంత భాగ్యమిదని గొల్లలు పాడారే

ఓరోరి సిన్నవాడా సూడరా గొప్ప తార
మనరాజు పుట్టే సూచనరా
ఆరా తెదామురా పండుగ చేదమురా
విలువైనవన్నీ అర్పిదామురా
అంటూ జ్ఞానులే చూడ వెళ్లారే
ఆ గొప్ప రాజుని పూజించారే
దేవధూతలే మహిమతో నిండారె
ఎంత అద్భుతమిదని పరవశించారే
||చందమామ చందమామ||

----------------------------------------------------------------------------------
CREDITS : 
Lyrics, Music, Tune, Sung by : Asha Ashirwadh Shaik
----------------------------------------------------------------------------------