4363) నీ చిత్తము సంపూర్తిగా నాలో జరిగించుమా


** TELUGU LYRICS **

నీ చిత్తము సంపూర్తిగా నాలో జరిగించుమా
నీ పరిపూర్ణ సంకల్పంలో నన్ను నడిపించుమా (2)
నీ ఉద్దేశ్యములు - ఉన్నతమైనవి 
నీ ఆలోచనలు - గంభీరమైనవి (2)
నా పూర్ణ హృదయముతో - నా పూర్ణ ఆత్మతో
నా పూర్ణ మనస్సుతో - నా పూర్ణ శక్తితో
యేసు నిన్నే ప్రేమింతును - నీ ఆజ్ఞలను గైకొందును  (2)

నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినావు  
నా అంతరింద్రియములను నీవే కలిగించినావు (2)
నాయెడల నీకున్న తలంపులు 
బహు విస్తారములు నా ప్రభువా (2)
నీ ఇష్టమే నాలో నేరవేర్చుమా (2)

నీకు వేరుగా ఉండి నేనేమి చేయలేను
నీకు లోబడకుండా నేను వర్దిల్లలెను (2)
నీ కట్టడలను నాకు బోధించి 
నీ వాక్యంతో నన్ను నిలుపుము (2)
నీ ఇష్టమే నాలో నేరవేర్చుమా (2)

-------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune & Producer : Jeevan Wesley Olesu
Music & Vocals : Sudhakar Rella & Lillian Christopher
-------------------------------------------------------------------------------------------