4415) కనులున్న కానలేని చెవులున్న వినలేని మనసున్న మతిలేని


** TELUGU LYRICS **

కనులున్న కానలేని - చెవులున్న వినలేని (2) 
మనసున్న మతిలేని - స్థితియున్న గతిలేని (2) 
వాడను యేసయ్యా - ఓడిపోయిన వాడను (2) 
||కనులున్న||

అన్నీవున్న ఏమిలేని - అందరు ఉన్న ఏకాకిని 
దారివున్నా కానరాని - చెంతనున్న చేరలేని 
యేసయ్యా... నన్ను విడువకయ్యా (2) దిక్కులేనివాడను 
వాడను యేసయ్యా - చెదరిపోయిన గూడును (2) 
||కనులున్న||

భాషలున్న భావములేని - ఆత్మవున్న అవివేకిని 
భక్తివున్న శక్తిలేని - ప్రార్ధనవున్నా ప్రేమలేని 
యేసయ్యా... నన్ను కరుణించుమా (2) ఫలములేనివాడను 
వాసిని యేసయ్యా - పేరుకు మాత్రమే విశ్వాసిని (2) 
||కనులున్న||

బోధవున్నా బ్రతుకులేని - పిలుపువున్న ప్రయాస పడని 
సేవవున్నా సాక్ష్యము లేని - సంఘమున్న ఆత్మలు లేని 
యేసయ్యా... నన్ను నింపుమయ్యా (2) ఆత్మలేని వాడను 
పాదిరిని యేసయ్యా - మాదిరి లేని కాపరిని (2) 
||కనులున్న||

------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Thodu Chaalunaya (నీ తోడు చాలునయా)
------------------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments