4388) దేవా నా ప్రార్థనా ఆలకించుమయా ఆదుకోవయా నన్ను చేర్చుకోవయా


** TELUGU LYRICS **

దేవా నా ప్రార్థనా ఆలకించుమయా
ఆదుకోవయా నన్ను చేర్చుకోవయా (2)
విరిగి నలిగిన మనసుతో నీ దరికి నే చేరితి
కరుణ కలిగిన యేసుని నామమున నే వేడితి
||దేవా||

యవ్వనమే నాదని ఎండమావుల చేరితి.
జీవమునే కాదని
జిగటఊబిలో కూరితి
కనులు తెరచి చూడగా నా చుట్టూ చీకటి ముసిరెనే 
మోడునై మిగిలాననీ కృంగిపోతిని
తోడుకై నిను వేడుచు చేయి చాపితి
భ్రమను వీడితి - నీ క్షమను కోరితి (2)
||దేవా||

యవ్వనమే నీదని నీ కాడి మోయగ చేరితి
జీవమునే కోరితి నీ కరుణ చూపగ వేడితి
కనులు తెరచి తేటగా నీ దివ్య ప్రేమను ఎరిగితి
యేసులో  చిగురించుటకు నే ఆశ చేసితి
జ్యోతిలా వెలగాలని నే బాస చేసితి
కృపను కోరితి - నీ శరణు వేడితి  
||దేవా||

----------------------------------------------------------------------------
CREDITS : Music : Giftson Durai 
Lyrics & Vocals : Joshua Katta & Tinnu Thereesh 
----------------------------------------------------------------------------