4432) ఆకాశ వీధిలో అందాల తార వెలసి అవనికి అంతా అందాలు తెచ్చేనంటా


** TELUGU LYRICS **

ఆకాశ వీధిలో అందాల తార వెలసి
అవనికి అంతా అందాలు తెచ్చేనంటా (2)
బెత్లెహేము పురములో రారాజు పుట్టాడని
ప్రవచనాలు నెరవేర్చి ప్రభువు ఇలకు వచ్చాడని
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)

యెష్షయి మొద్దు నుండి చిగురు పుడుతుందని
దావీదు కుమారునిగా మెస్సయ్యా వస్తాడని
ప్రవక్తలంతా చాటిరి ప్రభుమార్గము తెలిపిరి
లోకపు చీకటి తొలగించి వెలుగులు ప్రసరిస్తాడని
||హ్యాపీ||

కన్యయైన మరియకు పరిశుద్ధాత్మ వరముతో
పశువుల పాకలో ఉదయించే రక్షకుడని
దూత దెల్పగా వచ్చే గొల్లలు సంతసమొందిరే
ఇమ్మానుయేలును దర్శించి జనులకు సువార్త ప్రకటించే
||హ్యాపీ||

తూర్పు దేశ జ్ఞానులు కానుకలు తెచ్చిరి
ప్రభువు కు ప్రణమిల్లి పరవశులైరి
సర్వోన్నత స్థలములలో దేవుని కే మహిమంటూ
దూతలెల్లరూ పాడిరి దివ్యమైన గానము
||హ్యాపీ||  ||ఆకాశ||

--------------------------------------------------------------------
CREDITS : Music : Bro.Sampathkareti
Lyrics & Tune : Bro.Suresh Babu Panthagani
Vocals : Bro.Surya Prakash Injarapu
--------------------------------------------------------------------