4297) యేసు నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది


** TELUGU LYRICS **

యేసు నీ నామము 
ఎంతో బలమైనది - ఎంతో బలమైనది 
అద్భుతం ఆశ్చర్యం ఆశీర్వాదం - మరెన్నో (2)
శ్రీ యేసు నీ నామములో కలుగును (2)

పాపము నుండి - శాపము నుండి
నరకము నుండి - రక్షించే నామం (2)

వ్యాధుల నుండి - బాధల నుండి
వేదన నుండి - స్వష్టపరిచే నామం (2)

సాతాను నుండి - సమస్యల నుండి
అపవాది క్రియల నుండి - విడుదలిచ్చే నామం (2)

లేమి నుండి - దరిద్రత నుండి
ఇరుకు నుండి - ఆశీర్వదించే నామం (2)

రక్షణిచ్చే నామం - స్వస్థపరచే నామం
విడుదలిచ్చే నామం - ఆశీర్వదించే నామం (2)

-------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Vocals : Ps. John Paul Koka
Music : Prasanth Penumaka
-------------------------------------------------------------------------