** TELUGU LYRICS **
సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు
దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప
మహిమాత్మతో నను నింపితివా
అతిసుందరుడా నా స్తుతి సదయుడ
కోటి సూర్య కాంతులైనా నీతో సమమగునా
ఎనలేనే నీ ఘన కార్యములు తలచి
స్తుతించుచు నిను నే మహిమపరతును
దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప
మహిమాత్మతో నను నింపితివా
అతిసుందరుడా నా స్తుతి సదయుడ
కోటి సూర్య కాంతులైనా నీతో సమమగునా
ఎనలేనే నీ ఘన కార్యములు తలచి
స్తుతించుచు నిను నే మహిమపరతును
||సర్వాధి||
బలశౌర్యముగల నా యేసయ్యా
శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా
మారవే నీ సాహసకార్యములు యెన్నడు
ధైర్యముగా నిను వెంబడింతును
||సర్వాధి||
సర్వజగద్రక్షకుడా - లోక రాజ్య పాలక
భూరాజులెవ్వరినైన నీతో పోల్చగలనా
బలమైన నీ రాజ్యస్థాపనకై నిలిచి
నిరీక్షణతో నే సాగిపోదును
సర్వజగద్రక్షకుడా - లోక రాజ్య పాలక
భూరాజులెవ్వరినైన నీతో పోల్చగలనా
బలమైన నీ రాజ్యస్థాపనకై నిలిచి
నిరీక్షణతో నే సాగిపోదును
||సర్వాధి||
-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------