** TELUGU LYRICS **
దేవా నా ఆరధ్వని వినవా
నేనేల దూరమైతిని - కృప చూపవా నీ దరికి చేర్చుకొనవా
గాలివాన హోరులో గమ్యమెటో కానరాక
గురియైన నినుచేర - పరితపించుచున్నాను
ఆదరణయైనను - ఆరోగ్యమైనను ఆనందమైనను నీవేగదా
||దేవా||
అంతరంగ సమరములో ఆశలెన్నో విఫలము కాగ
శరణుకోర నినుచేర - తల్లడిల్లుచున్నాను
ఆధారమైనను - ఆశ్రయమైనను ఆరాధనైనను నీవేగదా

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------