4229) రాజ జగమెరిగిన నా యేసురాజా రాగాలలో


** TELUGU LYRICS **

రాజ - జగమెరిగిన నా యేసురాజా
రాగాలలో అనురాగాలు కురిపించిన
మన బంధము- అనుబంధము
విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను?

దీన స్థితియందున - సంపన్న స్థితియందున 
నడచినను - ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే 
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా 
||రాజ||

బలహీనతలయందున అవమానములయందున
పడినను - కృంగినను - నీ కృపకలిగి యుందునే
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా
||రాజ||

సీయోను షాలేము - మన నిత్య నివాసము
చేరుటయే నా ధ్యానము - ఈ ఆశ కలిగి యుందునే
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా
||రాజ||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------