4265) ప్రేమాంబుధి కృపానిధి నడిపించుసారధి నీ ప్రేమయే నా ధ్యానము


** TELUGU LYRICS **

    ప్రేమాంబుధి కృపానిధి నడిపించుసారధి
    నీ ప్రేమయే నా ధ్యానము
    నీ స్నేహమే నా ప్రాణము
    నీవే నా గానమూ

    ఎదుట నిలిచి నీవు ఉంటే భయములేదిక
    ఎండమావి నీరు చూసి మోసపోనిక
    సాగిపోయే నీడచూచి - కలత చెందక
    నీకై జీవించెద

    సంద్రమందు అలలఓలె అలసిపోనిక
    ధరణిలోని ధనము చూసి ఆశచెందక
    భారమైన జీవితాన్ని సేదదీర్చిన
    నీ ప్రేమ పొందెద

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------