4236) నీవు గాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్యా


** TELUGU LYRICS **

నీవు గాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్యా 
నీవే మార్గము సత్యము నీవే నిత్యజీవము నీవే గదయ్యా

ఘోరపాపముతో నిండిన నా హృదిని
మార్చితివే నీదరి చేర్చితివే
హత్తుకొని ఎత్తుకొని
తల్లివలె నన్ను ఆదరించితివే 
||నీవు||

అడుగులు తడబడిన - నా బ్రతుకు బాటలో
వేదకితివే నా వైపు తిరిగితివే
స్థిరపరచి - బలపరచి
తండ్రివలె నాకు ధైర్యమిచ్చితివే
||నీవు||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------