4235) నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే


** TELUGU LYRICS **

నా యేసయ్యా - నీ దివ్య ప్రేమలో
నా జీవితం - పరిమళించెనే

ఒంటరి గువ్వనై విలపించు సమయాన
ఒదార్చువారే - కానరారైరి
ఔరా! నీ చాటు నన్ను దాచినందున - నీకే నా స్తోత్రార్పణలు
||నా యేసయ్యా||

పూర్ణమనస్సుతో - పరిపూర్ణాత్మతో
పూర్ణ బలముతో - ఆరాధించెద
నూతన సృష్టిగా - నన్ను మార్చినందున - నీకే నా స్తోత్రార్పణలు
||నా యేసయ్యా||

జయించిన నీవు నా పక్షమైయుండగా
జయమిచ్చు నీవు - నన్ను నడుపుచుండగా
జయమే నా ఆశ - అదియే నీ కాంక్ష - నీకే నా స్తోత్రార్పణలు
||నా యేసయ్యా||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------