4164) కొనియాడెదను కృపగల దేవ కీర్తింతు నీ కృపాతిశయము


** TELUGU LYRICS **

కొనియాడెదను కృపగల దేవ 
కీర్తింతు నీ కృపాతిశయమును
కృపతో రక్షించిన నా యేసయ్య
సర్వకృపానిధి స్తోత్రించెదను
కృపా సత్య సంపూర్ణుడా 
దయ దాక్షిణ్య పూర్ణుడా (2)
కృపాక్షేమములే నా కిరీటం
నా ప్రభుయేసుని స్తుతియింతును  
||కొనియాడెదను||

నీ దోషములను క్షమించువాడవు 
రోగములన్నియు కుదుర్చువాడవు  (2)
నా ప్రాణమును విమోచించి 
మేలుతో నా హృదిని తృప్తిపరిచిన (2)
కృపా సత్య సంపూర్ణుడా 
దయ దాక్షిణ్య పూర్ణుడా (2)
కృపాక్షేమములే నా కిరీటం
నా ప్రభుయేసుని స్తుతియింతును  
||కొనియాడెదను||

నీ వాత్చల్యత సదా నిలుచునది
కరుణా కాటక్ష్యం నాపై చూపునది (2)
నీ భక్తులను విధేయులను
తరతరములకు దీవించువాడవు (2)
కృపా సత్య సంపూర్ణుడా 
దయ దాక్షిణ్య పూర్ణుడా (2)
కృపాక్షేమములే నా కిరీటం
నా ప్రభుయేసుని స్తుతియింతును
||కొనియాడెదను||

-------------------------------------------------
CREDITS : Album : Nee Rajyam 
Music : Jk Christopher
-------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments