4162) గొప్ప ఇశ్వర్యము కంటే గొప్ప పేరును వెండి బంగారము కంటే దయయు


** TELUGU LYRICS **

గొప్ప ఇశ్వర్యము కంటే గొప్ప పేరును
వెండి బంగారము కంటే దయయు (2)
కోరదగినవి  ఆశించదగినవి
యేసు ప్రేమ మాటలే కాంక్షించుదామ్ (2)

సర్వలోకము సంపాదించించి
ప్రాణము పోగొట్టుకొనిన ఏమి లాభం (2)
సర్వేశ్వరుడు యేసును వేడుకొని
ప్రార్ధించిన కలుగు నీకు మోక్షం (2)
ప్రతిదినం ఆయనతో జీవిస్తే 
కలుగును నీకు అధిక జ్ఞానం (2) 
||గొప్ప ఇశ్వర్యము||

ఆకాశ పక్షులను చూడుము 
వాటిని పోషించువాడు యేసే కదా (2)
సర్వ జీవులను కాపాడి 
తృప్తిపరచువాడు ఆయనే కదా (2)
ఆకాశ వాకుళ్ళు తెరచి 
సమృద్ధినిచ్చువాడు యెసేకదా (2) 
||గొప్ప ఇశ్వర్యము||

-------------------------------------------------
CREDITS : Album : Nee Rajyam 
Music : Jk Christopher
-------------------------------------------------