4150) యేసు నీ ప్రేమ ఎంతో మధురము యేసు నీ ప్రేమ మధురాతి మధురము


** TELUGU LYRICS **

యేసు నీ ప్రేమ ఎంతో మధురము 
యేసు నీ ప్రేమ మధురాతి మధురము (2)
జుంటే తేనే కన్నా ఎంతో మధురమైనది 
యేసు నీ ప్రేమే నాకు విలువైనది (2)
యేసు ప్రేమ మారని ప్రేమ 
యేసు ప్రేమ విడువని ప్రేమ (2) 
||యేసు నీ ప్రేమ|| 

లోకములో ఉన్న ప్రేమ శాశ్వతమైనది కానిది 
స్నేహితులే పంచే ప్రేమ నటజీవితమైనది (2)
యేసు నీ ప్రేమే నాకు శాశ్వతమైనది
యేసు నీ ప్రేమే నాకు జీవితమైనది (2)
యేసు ప్రేమ మారని ప్రేమ 
యేసు ప్రేమ విడువని ప్రేమ (2) 
||యేసు నీ ప్రేమ|| 

శోధనలో నేను పడియుండగా ఆదరించిన నీ ప్రేమ 
వేదనతో భాదపడుచుండగా హత్తుకొనిన నీ ప్రేమ (2)
యేసయ్య నీవంటివారు ఎవ్వరూలేరు 
నీ ప్రేమే నన్ను బ్రతికించి బలపరచును 
యేసు ప్రేమ మారని ప్రేమ 
యేసు ప్రేమ విడువని ప్రేమ (2)
||యేసు నీ ప్రేమ|| 

----------------------------------------------------------------------
CREDITS : Vocals : Ps. Israel Dorababu
Lyrics : Ps. Israel Dorababu & Ps. Nissi Israel
----------------------------------------------------------------------