4149) సిలువభారం భరియించింతివా శ్రమలు నాకై సహించితివా


** TELUGU LYRICS **

సిలువభారం భరియించింతివా
శ్రమలు నాకై సహించితివా (2)
ఓ దీన బంధు నా కరుణ సింధు (2) 
||సిలువభారం||

ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు
నా జీవమర్పింతు నీ సేవకు
ఏ హేతువైన లేదాయే నాలో
నీ ప్రేమ నేనొంద కరుణామయా (2)
స్తుతులు ప్రణుతులు చెల్లింతును
 (2) 
||సిలువభారం||

మరణించి నీవు బ్రతికించినావు
పరలోక జీవంబు నాకివ్వగా
పరమందు ఉన్నా నను వీడలేదు
పరమాత్మవై నన్ను పోషించగా (2)
ఆదరణ ఆధారం నీవైతివా
 (2) 
||సిలువభారం||

----------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune: Rev.Dr.V.Daivabhimani
Music & Vocals : J.K.Christopher & Joshua Gariki
----------------------------------------------------------------------------