4153) నా ప్రియ యేసువా నిన్ను సంధించువేళ

  
** TELUGU LYRICS **
  
    నా ప్రియ యేసువా నిన్ను సంధించువేళ (2) 
    మనోహరమగు నీ మోము నేగాంచువేళ
    ఎంతో ఆనందం ఎంతో ఆనందం 
    ఎంతో ఆనందం ఎంతో ఆనందం (2)
    ఆహా ఎంతో ఆనందం హల్లెలూయా గీతం 
    నే పాడే సమయం నా యేసు సాన్నిత్యం (2) 
    ||నా ప్రియ|| 

1.  నాకై గాయాలు పొందిన నీ బాహువులులో  
    నే చేరి మురిసి పరవసించువేళ
    నీ యదపైన నేవాలి సేదతీరువేళ
    నా కనుల బాష్ప బిందువులు నీవు తుడుచు వేళా
    ||నా ప్రియ|| 

2.  భువిపై నీ సేవలో పరుగెడిన పాదములు 
    పరమందు స్వర్ణ వీధులలో నడయాడు వేళ
    నా తలవంచి నీ పదములు ముద్దాడువేళ 
    నా శిరమున మకుటం ధరియించువేళ 
    ఎంతో ఆనందం ఎంతో ఆనందం 
    ఎంతో ఆనందం ఎంతో ఆనందం (2)
    ఆహా ఎంతో ఆనందం హల్లెలూయా గీతం 
    నే పాడే సమయం నా యేసు సాన్నిత్యం (2)
    ||నా ప్రియ|| 

------------------------------------------------
CREDITS : 
Album : Friend
------------------------------------------------