4139) నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్ధన విజ్ఞాపన

    
** TELUGU LYRICS **

    నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని 
    నా ప్రార్ధన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని (2)
    అక్షయుడా నీ కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను 
    ఆశలవాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు
 (2)
    నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే 
    నీ సన్నిధిలో స్తుతిపాడనా నా హృదయ విధ్వాంసుడా
    ||
నా కోరిక||

    యధార్దవంతుల యెడల నీవు యెడబాయక కృపచూపి 
    గాఢాందకారము కమ్ము కొనగా వెలుగు రేఖవై ఉదయించినావు
 (2)
    నన్ను నీవు విడిపించినావు ఇష్టుడనై నే నడచినందునా 
    దీర్ఘాయువుతో తృప్తిపరచినా సజీవుడవు నీవేనయ్యా 
    ||నా కోరిక||

    నాలో ఉన్నది విశ్వాసవరము తోడై ఉన్నది వాగ్ధాన బలము 
    ధైర్య పరచి నడుపు చున్నవి విజయ శిఖరపు దిసెగా
 (2)
    ఆర్పజాలని నీ ప్రేమతో ఆత్మదీపం వెలిగించినావు‌ 
    దీన మనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వీకుడా
    ||నా కోరిక||

    స్వచ్ఛమైనది నీ వాక్యం వన్నె తరగని ఉపదేశం 
    మహిమ గలిగిన సంఘముగా నను నిలుపునే నీ యెదుట
 (2)
    సిగ్గుపరచదు నన్నెన్నడు నీలో నా కున్న నిరీక్షణ 
    వేచి యున్నాను నీ కోసమే సిద్ధపరచుము సంపూర్ణడా 
    ||నా కోరిక||

-------------------------------------------------------------------------
CREDITS : Hosanna Ministries (హోసన్నా మినిస్ట్రీస్)
Album : Adviteeyudaa (అద్వితీయుడా)
-------------------------------------------------------------------------