4146) మానవాళికై మరణ వేదన పాపము కొరకై ప్రసవ వేదన


** TELUGU LYRICS **

మానవాళికై మరణ వేదన 
పాపము కొరకై ప్రసవ వేదన
నా శిక్షను భరియించుటకే నా పాపము క్షమియించుటకే (2)
సిలువ వేదన మరణ యాతన మానవాళి రక్షణకై నీ ప్రార్ధన (2) 
||మానవాళికై||

దూషణ ద్వేషములు సిలువకు నిన్ను కొట్టగా
కొరడా దెబ్బలు నీ వీపును బహుగా చీల్చగా (2) 
మౌనివైతివా మోత్తబడితివా 
మరపురాని నీ ప్రేమను చూపితివా (2) 
 
||మానవాళికై||

అపహసించిరి అవమానపరిచిరి నీ వస్త్రమును చీట్లు వేసిరి
ఉమ్మి వేసిరి మేకులను కొట్టిరి ముళ్ళ కిరీటం తలకు గుచ్చిరి (2)
బదులు పలుకలేదు నోరు తెరువలేదు 
నలుగగొట్టబడుటకు ఇష్టపడితివి (2)
  
||మానవాళికై||

-----------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Pastor Ravi Kumar Mukthupudi
Vocals & Music : Nissy John & Sandeep Kumar Velicharla
-----------------------------------------------------------------------------------------