4106) కోటి కోటి వందనాలయా నా యేసు రాజా వేల వేల స్తోత్రాలయ్యా దివ్యతేజ


** TELUGU LYRICS **

కోటి కోటి వందనాలయా నా యేసు రాజా 
వేల వేల స్తోత్రాలయ్యా దివ్యతేజ (2)
అద్భుతకరుడ ఆలోచనకర్త 
బలవంతుడైన అద్వితీయుడా
 (2)
నీకే ఆరాధనా నీకే ఆరాధనా 
నీకే ఆరాధనా నీకే ఆరాధనా 

గుడ్డివారికి చూపుఇచ్చి 
మూగవారికి మాటఇచ్చి 
 (2)
ఎన్నెన్నో అద్భుతాలుచేసి
నీ క్రియలను కనుపరచినావు 
(2)
నీకే ఆరాధనా నీకే ఆరాధనా 
నీకే ఆరాధనా నీకే ఆరాధనా 

బలహీనులను బలపరచి
జ్ఞానహీనులకు జ్ఞానమిచ్చి
 (2)
బంధింపబడిన వారిని 
విడుదల కలిగించినావు
 (2)
నీకె ఆరాధనా నీకె ఆరాధనా 
నీకె ఆరాధనా నీకె ఆరాధనా 

మా పాపములను  క్షమించి 
నీ ఆత్మను మాకు నొసగి
 (2)
కరుణాకటాక్షము చూపి 
నీ ప్రేమను కనుపరచినావు
 (2)
నీకే ఆరాధనా నీకే ఆరాధనా 
నీకే ఆరాధనా నీకే ఆరాధనా

-------------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------------