4104) ఎంతో ఆశ యేసు నిన్ను చూడాలని నాలో ప్రాణం వేడింది నీ సన్నిధి


** TELUGU LYRICS **

ఎంతో ఆశ యేసు నిన్ను చూడాలని..
నాలో ప్రాణం వేడింది నీ సన్నిధి
ప్రేమతో ప్రార్థించనా అశ్రువై అర్ధించనా..
పరమునకు వినిపించగా విజ్ఞాపనే చేయనా...

నేను ముద్రించుకున్న హృదయమందు ఒక రూపుని 
యేసయ్య దర్శనమిచ్చి నిజము చెయ్యి నా ఊహని
అగ్నిజ్వాల కన్నులు నన్ను చూడనీ యేసయ్య..
నిన్ను తాకి నే తరియించనీ...
సన్నుతించి నిన్నే స్తుతియించనీ యేసయ్య..
పరవశముతో నే నాట్యమాడనీ...

వధువునై నీతో నడిచి ఆకాశపు విందు చేసి 
మహిమగల రెక్కలతో మైమరచి సంచరించి
నూతన యెరుషలేములో యేసయ్య
వెయ్యేండ్ల ఉత్సవ నీ ఒడిలో..
సకల దేవదూతలపక్షముగా యేసయ్య
ప్రభువా అని నే పిలిచెదా..

-------------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------------