4111) దేవా నీ సన్నిధి నాకుండగా రాజా ఏ భయము ఇక లేదుగా

    
** TELUGU LYRICS **

    దేవా నీ సన్నిధి నాకుండగా
    రాజా ఏ భయము ఇక లేదుగా (2)
    ఆశ్రయమైనావు ఆరాధించగా
    ఆదుకుంటావు ఆపద కంటే ముందుగ
 (2)
    దేవా నీ సన్నిధి నాకుండగా
    రాజా ఏ భయము ఇక లేదుగా
    నా దేవా నీ సన్నిధి నాకుండగా
    రాజా ఏ భయము ఇక లేదుగా

    అంధకారములో అలసిన నా బ్రతుకును 
    ఆదరిస్తావు ఇమ్మానుయేలుగ
    కనిపించని దారిలో నా శోదన కొలిమిలో 
    నా పాదములకు నీవు దీపమైనావుగా (2)
    నా దుఃఖ దినములన్నీ సమాప్తమగునని చెప్పి 
    సంతోషమిస్తావు చాలిన ప్రియుడవు 
    నా దీన ప్రార్థనకు సమాధానమిచ్చి 
    నెమ్మదినిస్తావు నజరేయుడవు
 (2)
    ||దేవా నీ సన్నిధి నాకుండగా||

    నా బలహీనతలో నా వ్యాధి వేదనలో 
    నీ బలమునిస్తావు పరమ వైద్యుడవు నీవు
    నే కృంగిన వేళలో ఏ ఆశ లేనప్పుడు 
    సమస్తమును నాకై సమకూర్చి చేస్తావు (2)
    అగ్ని మేఘస్తంభమై రేయిపగలు నను కాచే 
    ఆరాధ్య దైవమా ఆరాధించెదను
    నే బ్రతుకు దినములన్ని కృపా క్షేమము నిచ్చే 
    నా మంచి నేస్తమా నే పాడి పొగడెదను (2)
    ||దేవా నీ సన్నిధి నాకుండగా||

-------------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------------