4099) ఆరాధించెదను బలవంతుడా నిన్నే అజేయుడా యేసయ్యా


** TELUGU LYRICS **

ఆరాధించెదను బలవంతుడా నిన్నే 
అజేయుడా యేసయ్యా 
ఆనందించెదను గుణవంతుడా నీలో 
సజీవుడా యేసయ్యా

అతిశయం నీవే ఆశ్రయం నీలో 
కేడెము నీవే క్షేమము నీలో 

మార్గం ఇరుకై సౌఖ్యం అరుదాయెనే 
స్నేహం కరువై జీవం బరువాయెనే 
బలహీనుడనై కృంగిన వేళ 
ఆదరించావయ్యా (యేసయ్యా) 

ఆధారం నీవే ఆదరణ నీలో 
నిత్యము నీవే యేసయ్యా నీవే 

సత్యం కొరకై నింద కలిగినను 
శోధనలెదురై గుండె చెదరినను 
ఒంటరి నేనై  నలిగిన వేళ 
ఆదుకొన్నావయ్యా (యేసయ్యా) 

ధైర్యము నీవే కార్యము నీలో 
దుర్గము నీవే యేసయ్యా నీవే 

-------------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------------