4000) పరిశుద్ధ జనమా పరలోక జనమా (151)

** TELUGU LYRICS **

    - జి.నిరీక్షణ్ రావు

    పరిశుద్ధ జనమా - పరలోక జనమా 
    వరుడు యేసునికి - వధువైన జనమా 
    ధరయందు పరమందు క్రీస్తేసే - సర్వ పరిపూర్వ దైవాత్మ నరుడే 

1.  యేసే సర్వమును - యేసే అధికారి 
    యేసే సృష్టికి - ఆది సంభూతుడు 
    యేసే ఇలలో - యేసే దైవం 
    యేసే జ్ఞానం - యేసే దైవం 
    ||పరిశుద్ధ||

2.  యేసుని పోలికలో - సాగించు నీ పయనం 
    దాసునిగ - అర్పించుము సర్వము 
    యేసే మనకు - జీవిత గమ్యం 
    భాసురంబగు - క్రైస్తవ జనమా
    ||పరిశుద్ధ||

3.  శ్రమల ద్వారా - సంపూర్ణత నాశించుము 
    సమర్పణతో పరిచర్య చేయుము 
    ప్రేమతోడ - సహనము తోడ 
    సమతా మమతలు - నిలుపుము ఇలలో
    ||పరిశుద్ధ||

4.  ఎవరు ఏమన్నా - ఎదురేమి నీకున్న 
    వెనుతిరిగి - చూడకు క్రైస్తవమా 
    ప్రభుని చిత్తము - నెరవేర్చుటలో 
    ప్రభువు తోడుగ - ఉన్నాడు ఎపుడు
    ||పరిశుద్ధ||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------