3958) నశియించు ఆత్మలు నీ చెంత నుండ గమనించవా సోదరా (104)

** TELUGU LYRICS **

    - Scale : Em

    నశియించు ఆత్మలు నీ చెంత నుండ - గమనించవా సోదరా 
    ప్రభు యేసు ప్రేమతో పిలచుచుండ గమనించవా సోదరా 
    ||నశియించు|| 

1.  ప్రాణంబు నిచ్చె నీ పాపములకై - ప్రార్ధింప బరువాయెనా రక్తంబు కార్చె 
    నీ దోషములకై పనిచేయ బరువాయెనా 
    ||నశియించు|| 

2.  నీ తోటి యువకుల్ నీ తోటి యువతుల్ - నశియించ ఆనందమా 
    సత్యంపు మార్గం ప్రకటించలేవా జీవంపు మార్గం జూపించ రావా 
    ||నశియించు|| 

3.  సర్వంబు నిచ్చె నీ కోసమేగ - ప్రభుకీయ భయమేల 
    భారంబులేని బ్రతుకేలనయ్యా- శ్రీయేసు ప్రేమను ప్రకటింప రావా 
    ||నశియించు|| 

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------