3929) చేయి చేయి కలిపి యేసు మనసును కలిగి

** TELUGU LYRICS **

    - పి.యేసురత్నం
    - Scale : G

    చేయి చేయి కలిపి
    యేసు మనసును కలిగి
    మనము మనసులు కలిసి
    ఏకమనసును కలిగి
    కలసి మెలసి పనిచేద్దాం - ఏకముగా ప్రార్థిద్దాం
    కలిమిలోన - లేమిలోన - కలకాలం కలిసుందాం

1.  అహం, కులం - వదిలేద్దాం
    అంతరాలు పూడ్చేద్దాం
    ఒకరి నొకరు యోగ్యులుగా
    అందరినీ ఎంచుదాం  
    ||చేయి||

2.  విలువైన రక్తముతో
    కొనబడిన సహవాసం 
    విభేదాలు విడనాడి
    విలువలను నాటుదాం
    ||చేయి||

3.  దారుణమగు హింసలలో
    ధైర్యంగా నిలబడదాం 
    హింసకులను క్షమించి 
    రక్షణకై ప్రార్థిద్దాం
    ||చేయి||

** CHORDS **

              G
    చేయి చేయి కలిపి
    C      D         G
    యేసు మనసును కలిగి
    
    మనము మనసులు కలిసి
    C       D    G
    ఏకమనసును కలిగి
    C            D           C        Em
    కలసి మెలసి పనిచేద్దాం - ఏకముగా ప్రార్థిద్దాం
    C            D          C        Em
    కలిమిలోన - లేమిలోన - కలకాలం కలిసుందాం

                     G
1.  అహం, కులం - వదిలేద్దాం
    Am        Em
    అంతరాలు పూడ్చేద్దాం
                  C
    ఒకరి నొకరు యోగ్యులుగా
    D        Em
    అందరినీ ఎంచుదాం
    ||చేయి||

2.  విలువైన రక్తముతో
    కొనబడిన సహవాసం 
    విభేదాలు విడనాడి
    విలువలను నాటుదాం
    ||చేయి||

3.  దారుణమగు హింసలలో
    ధైర్యంగా నిలబడదాం 
    హింసకులను క్షమించి 
    రక్షణకై ప్రార్థిద్దాం 
    ||చేయి||

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------