3858) నిన్ను విడువని నీ దేవుడు ఎడబాయడుగా ఎల్లప్పుడూ

    

** TELUGU LYRICS **

    నిన్ను విడువని నీ దేవుడు ఎడబాయడుగా ఎల్లప్పుడూ
    కన్నీరు ఎందుకు దిగులు చెందకు
    నిన్ను నడుపునుగా నీ జీవితాంతం

1.  సింహాసనం నుండి దిగివచ్చే యేసు బహు శ్రమనొందెను నీకోసమేగా
    స్వరూపమైనను సొగసైన లేక వధకు తేబడిమౌనియాయెను
    నీ క్షేమమునే తలచెనుగా నీ స్థానములోనె మరణించగా

2.  చెయ్యని నేరాలు నాపై మోపి అవమానాలనే ముళ్ళతో గ్రుచ్చి
    మాటలనే అగ్నితో నిత్యం కాల్చి వరిగిన గోడను పడద్రోసితిరా 
    క్రిందపడినను ఓడెదనా చాచిన హస్తమే తోడగునే

3.  నీ కొరకే బ్రతకాలనుకుంటిని స్థిరనిర్ణయముతో సాగుచుంటిని
    పరిస్థితులన్నీ తలక్రిందులాయె సమస్యలే సుడిగుండాలాయె 
    మరువని స్నేహమే మాటఇచ్చెనే విడువక వాత్సల్యమే చూపెనే

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------